కమాన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ గా భాస్కర్ రావు

కమాన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ గా భాస్కర్ రావు

విశ్వంభర, కమాన్ పూర్ : కమాన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ గా ఇనగంటి భాస్కర్ రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే వైస్ చైర్మన్ చిందం తిరుపతి, డైరెక్టర్లుగా ఆడువాల చంద్రయ్య, గుండేటి శ్రీమూర్తి, వరాల నర్సింగం, ఊదరి నరేష్, ముస్కుల వీరలక్ష్మి, జనగామ తార లు కూడా బాధ్యతలు స్వీకరించారు. గత సంవత్సరం 19 న సింగిల్ విండో పాలక వర్గాలను రద్దు చేసి పర్సన్ ఇంచార్జ్లను నియమించింది. సింగిల్ విండో పాలక వర్గాలకు ప్రభుత్వం పొడిగించిన  గడువు ముగియక ముందే రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తిరిగి పాత పాలక వర్గాలకు బాధ్యతలు అప్పగించాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు పాత సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు సీ. ఈ. వో తిమ్మరాజు సంతోష్ కుమార్ సమక్షంలో రిజిస్టర్ లో సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు.  రబీ సీజన్ లో రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా పర్యవేక్షణ చేయడం జరుతుందన్నారు. అనంతరం చైర్మన్ బాస్కర్ రావు,వైస్ చైర్మన్ తిరుపతి, డైరెక్టర్లకు సింగిల్ విండో కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది శాలువాలు కప్పి ఆత్మీయ సత్కరించారుWhatsApp Image 2026-05-07 at 9.29.42 AM

Tags: