కాజీపేటలో నూతన “హోటల్ అమాన్స్” ను  ప్రారంభించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య 

కాజీపేటలో నూతన “హోటల్ అమాన్స్” ను  ప్రారంభించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య 

విశ్వంభర హనుమకొండ జిల్లా :-హనుమకొండ జిల్లా కాజీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన “హోటల్ అమాన్స్” వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్‌లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను పరిశీలించిన ఎంపీ డా. కడియం కావ్య, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. స్థానికంగా కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటవడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ హోటల్ మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. వ్యాపార రంగంలో ముందుకు వస్తున్న యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు, హోటల్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: