జర్నలిస్టుపై దాడిని ఖండించిన టీయూడబ్ల్యూజేహెచ్

విశ్వంభర, మహబూబాబాద్ : మెదక్ జిల్లా నర్సింగ్ మండలంలో మన తెలంగాణ రిపోర్టర్ రాఘవేంద్రపై జరిగిన దాడిని నిరసిస్తూ బుధవారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు టీయూడబ్ల్యూజేహెచ్-143 ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య యాదవ్, స్టేట్ కమిటీ సభ్యుడు వీరగాని భిక్షం, జిల్లా నాయకులు పాల్గొని జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ నిరసనలో సుబ్రహ్మణ్యం, కిరణ్, శ్రీధర్, చక్రధర్, పురుషోత్తం, మురళి, వెంకటేశ్వర్లు, మాదాసు మహేష్, శ్రీనివాస్, భిక్షం, రామచంద్రు తదితరులు పాల్గొన్నారు

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/twjh-condemned-the-attack-on-the-journalist/article-17147

Tags: