ఓట్ల తొలగింపుపై కుట్ర
విశ్వంభర, హైదరాబాదు : ఎస్ఐఆర్ పేరుతో వ్యతిరేక ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది… ప్రతి ఓటరుడు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎం అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాదు ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్‌ను అడ్డుపెట్టుకొని బీజేపీ ప్రణాళికాబద్ధంగా ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ కార్యక్రమం నేపథ్యంలో ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని, బీఎల్ఓలు మూడు సార్లు ఇంటింటికీ సందర్శించిన తరువాతే ఓట్ల తొలగింపు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఇదే విధానంతో గెలిచారని విమర్శించారు. ఓటు ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయని, ముషీరాబాద్‌లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఓటర్లకు సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో: వాజీద్ హుస్సేన్ పాశం అనిల్ కుమార్ యాదవ్ సంఘ పాక వెంకట్ బద్దం మోహన్ రెడ్డి, నవీన్ నాయక్ పాల్గొన్నారు.