సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి

  • వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి 
  •  జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

విశ్వంభర,  రాజన్న సిరిసిల్ల: సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఔట్ పేషెంట్ రిజిస్టర్, ల్యాబ్, మందులు ఇచ్చే గది, ఇన్ పేషెంట్ వార్డు పరిశీలించి.. రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై వివరించాలని పేర్కొన్నారు. నీటిని కాచి చల్లార్చిన తర్వాత తాగేలా అవగాహన కల్పించాలని తెలిపారు. వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని, గర్భిణులకు క్రమం తప్పకుండా అన్ని పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/awareness-should-be-created-about-seasonal-diseases/article-17228

Tags: