శివానంద గురు కల్చరల్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు

విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ ములుగు రోడ్డు లోని సప్తధామంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలలో 31 మంది జంటలకు ఉచితంగా వివాహాలు జరిపించినట్లు శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్రీ త్రిపురనేని గోపీచంద్ బుధవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ సామాజిక సేవ దృక్పథంతో శివానందమూర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో 31 మంది జంటలకు వివాహాలు జరిపించడంతో పాటు వారికి అవసరమైన బంగారు పూస్తేలు,మట్టెలు, పెళ్లి బట్టలు ఉచితంగా అందిచామని తెలిపారు. పెళ్లి అనంతరం శ్రీరమ సత్యనారాయణ స్వామి వ్రతం చేపించి వచ్చిన బంధువులందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గోపీచంద్ తెలిపారు.త్రినగరి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు బండారు సాయి నారాయణ, మాదారపు సదాశివుడు,గందే ఉమాశంకర్, రేపాల రామచందర్, లాయక్, మంతెన వెంకటరమణ, కైరిక రవీందర్ జీ,తదితరులు పాల్గొన్నారు

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mass-weddings-under-sivananda-guru-cultural/article-17145

Tags: