మోదీ పర్యటనను అడ్డుకుంటాం : ఆప్ సుధాకర్
On
విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు అర్హత లేదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సలహాదారు డాక్టర్ దిడ్డి సుధాకర్ విమర్శించారు. పర్యటనను చీపుర్లు చూపిస్తూ అడ్డుకుంటామని తెలిపారు. హైదరాబాదులో విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, ప్రతిపక్షాలపై ఒత్తిడి వంటి చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా బేగంపేట విమానాశ్రయం వద్ద నిరసన చేపడతామని తెలిపారు.



