మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి 

మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి 

  • మోదీ బహిరంగ సభను విజయవంతం
  • చేయాలి  బిజెపి జిల్లా నేత నవీన్ నాయక్

విశ్వంభర, ఇనుగుర్తి: బిజెపి ఆధ్వర్యంలో హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఈనెల 10న నిర్వహించే భారత ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు భారీగా తరలిరావాలని బిజెపి జిల్లా యువ నేత గుగులోతు నవీన్ నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మోదీ పాలనలో దేశం పుష్కరకాలంగా భద్రంగా పరిరక్షించబడుతూ, అవినీతి రహిత పాలన కొనసాగుతున్నదన్నారు. అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. కరోనా కష్టకాలం నుంచి దేశంలో ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఫసల్ (పంటల)భీమా, పీఎం కిసాన్ అర్హులైన రైతులకు రు.6 వేల చొప్పున పెట్టుబడి,ఇంటింటికి మరుగుదొడ్డి,జీపి లకు నిధులు అందజేస్తూ మోడీ సర్కార్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.బెంగాల్ తో సహా భారత్ మోదీమయం అవుతున్న దృష్ట్యా తెలంగాణలోనూ త్వరలోనే బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఇనుగుర్తి మండలంలోని వివిధ గ్రామాలు జిల్లా వ్యాప్తంగా యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు సభకు అధిక సంఖ్యలో సభకు హాజరుకావాలని కోరారు.

Tags: