ప్రతి ఒక్కరు యోగ చేయాలి 

ప్రతి ఒక్కరు యోగ చేయాలి 

  • - మెదక్ ఎంపీ రఘునందన్ రావు  

విశ్వంభర, సిద్దిపేట:  యోగా చేయడం ప్రతీ ఒక్కరు అలవాటు చేసుకోవాలని  మెదక్ ఎంపీ రఘనందన్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం ఒలింపిక్ రన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పిల్లలను ఎండలో ఉంచడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదని, డీ-విటమిన్ కోసం ట్యాబ్లెట్లు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శరీరానికి సూర్యరశ్మి తాకినప్పుడే మనసు ఉత్తేజంగా ఉంటుందని తెలిపారు. స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులకు యోగా నేర్పించాలన్నారు. ప్రతీ జూన్ 23తేదీన ఒలంపిక్ డేను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఒలంపిక్స్ లో చైనా ముందు ఉంటే భారత్ కింద ఉండేదని, కానీ నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక క్రీడలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు  పిల్లలకు క్రీడలను అలవాటు చేయాలని చెప్పారు. స్వామి వివేకానంద చెప్పినట్టు మన దేశానికి కావాల్సింది భగవద్గీత పుస్తకాలు కాదని క్రీడా మైదానాలు కావాలని ఉద్ఘాటించారు. సిద్దిపేటలో క్రీడా మైదానం పెద్దగా ఉండటం విద్యార్థుల అదృష్టమని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతీ విద్యార్థి ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నాయకులు సంతోష్, కిరణ్, బాసంగారి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/everyone-should-do-yoga/article-17177

Tags: