రౌడీయిజం చేస్తామంటే కుదరదు: సీఎం చంద్రబాబు

రౌడీయిజం చేస్తామంటే కుదరదు: సీఎం చంద్రబాబు

విశ్వంభర, ఏపీ బ్యూరో: తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ స్థాపించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

విశ్వంభర, ఏపీ బ్యూరో: తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ స్థాపించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఒకప్పుడు తెలుగువారిని “మదరాసి” అంటూ అవమానించిన పరిస్థితుల్లో, ప్రత్యేకమైన తెలుగు జాతి ఉందని దేశానికి గుర్తు చేసిన నాయకుడు ఎన్టీఆర్‌ అని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్‌ 30వ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ఎన్టీఆర్‌ విగ్రహానికి సీఎం పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు.

రిజర్వేషన్లకు బాటలు వేసిన నాయకుడు ఎన్టీఆర్‌:
బీసీలకు స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని సీఎం గుర్తుచేశారు. మహిళలకు ఆస్తిలో సగం వాటా హక్కు కల్పించి, సమానత్వానికి బలమైన పునాది వేశారని తెలిపారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాకముందు పెద్దగా చదువు లేని వ్యక్తులే ఎక్కువగా రాజకీయాల్లో ఉండేవారని, అయితే చదువుకున్న వారికి అవకాశాలు ఇవ్వాలని ఎన్టీఆర్‌ నమ్మారని చెప్పారు.

Read More సమ్మక్క - The Glory of Medaram (హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో స్టాల్ల్స్ నెం. 283 , 348 లో లభ్యం)

టీడీపీలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా ఎన్టీఆరేనని చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్‌ వచ్చిన తర్వాతే కృష్ణా మిగులు జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కూ హక్కు ఉందనే విషయం స్పష్టమైందన్నారు. రాయలసీమకు తగినంత నీళ్లు అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు.

త్వరలో 700 అన్నక్యాంటీన్లు:
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 700 అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఉగాది పండుగ రోజున మరో 5 లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయని చెప్పారు. ఆర్థికంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

మన పూర్వీకులు ఇచ్చిన భూములపై గత పాలకులు తమ ఫొటోలు పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించారని చంద్రబాబు విమర్శించారు. తాను వెళ్లిన ప్రతి ప్రాంతంలోనూ 80 శాతం ఫిర్యాదులు భూముల సమస్యలపైనే వస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.700 కోట్లు ఖర్చు చేసి సర్వే రాళ్లపై తమ ఫొటోలు వేయించుకున్నారని ఆరోపించారు.

ఉద్యోగుల బకాయిలు చెల్లించి వారికి నిజమైన సంక్రాంతి కానుక అందించామని చంద్రబాబు తెలిపారు. దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు రాష్ట్రానికి రావడం గర్వకారణమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి పూర్తిగా సహకరిస్తూ, దేశ అభివృద్ధిలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోందని సీఎం స్పష్టం చేశారు.babu

Tags: