సంవత్సరం కిందట తప్పిపోయిన వ్యక్తి 

సంవత్సరం కిందట తప్పిపోయిన వ్యక్తి 

విశ్వంభర, గుండాల : గుండాల మండలం రామారం గ్రామానికి చెందిన మెంటా సునీత భర్త మదర్ సంవత్సర క్రితం ఇంటి నుండి ఎక్సెల్ మోపెడ్ వాహనం వెళ్లి  తప్పిపోయినట్లుగా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్లుగా ఎస్సై తేజం రెడ్డి తెలిపారు. నేటికీ  సంవత్సరం కావస్తున్న ఎలాంటి సమాచారం అందలేదని ఎస్సై తేజం రెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులను వివరణ అడగగా తప్పిపోయి సంవత్సరం అవుతున్నదని బంధువుల ఇళ్లలో అన్ని దిక్కుల తిరిగిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పోయేముందు ఇంటి వద్ద ఎక్సెల్ మోపెడు వాహనం లేదు తను కూడా కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికిన కనిపించలేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంటు ఇచ్చామని తెలిపారు. నేటికీ దిగులుతో ఉన్న కుటుంబం  సభ్యులు కనీసం మోపాడు వాహనం ఆనవాళ్లు దొరకకపోవడం కుటుంబంలో ఆందోళనతో ఉన్నారు.

Tags: