ఘనంగా గాంధీజీలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలు - మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు
On
విశ్వంభర, చండూరు: విద్యార్థులకు స్వయం అనుభవం కోసమే స్వపరిపాలన దినోత్సవంను నిర్వహించినట్లు చండూరు మున్సిపాలిటీలోని గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు, చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. సోమవారం నాడు గాంధీజీ విద్యాసంస్థలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఒక్కరోజు పాలనలో విద్యార్థులు నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా, ఉపాధ్యాయులుగా తమ పాత్రలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నారని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు లుగా పెద్ద కాన్వాయ్ గా చండూరు మున్సిపాలిటీ వీధుల్లో తిరుగుతూ... ప్రజలను పలకరించడంతో నిజంగా ముఖ్యమంత్రి మరియు మంత్రులు చండూరుకు వచ్చారా అన్నట్లుగా ప్రజలందరూ ఎంతో ఆసక్తితో తిలకించారు. కలెక్టర్, డీఈవో, ఎంఈఓ లుగా పాఠశాలకు రావడం పలువురిని ఆకట్టుకుంది. పాఠశాల ఆవరణలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ విద్యార్థులను ఎంతగానో ఆకర్షించింది. స్వపరిపాలన దినోత్సవంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు బహుమతులను అందించారు.ఈ స్వపరిపాలన దినోత్సవం లో సీఎంగా సాయి విగ్నేష్, డిప్యూటీ సీఎం గా కె. చందు,మంత్రిగా బి సాయిరాం, హర్షవర్ధన్, ప్రతిపక్ష నాయకులుగా కె.సాయిరాం, వై ఈశ్వర్, కె ప్రదీప్, జే. శివప్రసాద్, కలెక్టర్‌గా ఏ శిరీష, జాయింట్ కలెక్టర్‌గా ఆర్ వర్షిత, ఆర్డీఓ గా కావ్య, డీఈవోగా బి. జయశ్రీ, ఎండి జోహా, కరస్పాండెంటుగా కె. దివ్య , హెచ్ఎం గా జి. యమునా జి. భార్గవి , తమ తమ పాత్రలను పోషించారు.ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



