ఇరాన్‌పై  దాడులను  ఖండించాలి 

  •  సిపిఐ ఎమ్మెల్ న్యూడెమోక్రసీ 

విశ్వంభర, మహబూబాబాద్: గత మూడు రోజులుగా ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ  రాష్ట్ర కార్యదర్శి అశోక్ అన్నారు . ఈ దాడులలో ఇరాన్ అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకొని బాంబులు వేయడం, సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం జరుగుతోందని చెప్పారు.  ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ దురాగ్రహపూరిత చర్యలుగా భావిస్తూ  సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తోంది. వందల కోట్ల లక్షలాది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడేలా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రపంచ శాంతిని భంగం కలిగించే విధంగా అమెరికా - ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్నాయి. ఈ ఫాసిస్టు దాడులు వెంటనే నిలిపివేయాలని, సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ యుద్ధం కొనసాగితే మధ్యప్రాచ్య ప్రాంతంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాలు పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించడానికి ఇలాంటి దాడులు చేస్తోందని విమర్శించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం అమెరికా మద్దతుతో ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతోందన్నారు. ప్రపంచ శాంతి, భద్రతలను కాపాడేందుకు ఐక్యరాజ్యసమితి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే నిలిపివేసి శాంతి తక్షణ మే చర్చలు ప్రారంభించాలని, ప్రజల ప్రాణ నష్టాన్ని అరికట్టాలని  డిమాండ్  చేస్తున్నామని అన్నారు .

Tags: