బ్రహ్మోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు
విశ్వంభర, చింతపల్లి: ప్రతి ఒక్కరు భవానీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు. భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక చరిత్రకు ప్రతీకగా నిలిచిన శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈ సంవత్సరం కూడా వైభవంగా బ్రహ్మోత్సవాలకు ముస్తాబయిందన్నారు.దేవస్థానం పరిసరాలు విద్యుత్ దీపాలతో, పుష్పాలతో అలంకరించబడగా,గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు.శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని విశ్వకర్మ భజన బృందం,డప్పు చప్పులతో ఊరేగింపుగా గుట్ట ఎక్కుటతో పాటు కామదహనం జరిగిందన్నారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు,నిత్య అన్నదానం,రథోత్సవం మహోత్సవం జరుగునన్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయం,ఉచిత అన్న ప్రసాదం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, ఆలయ అర్చకులు సురభి సత్యనారాయణ శర్మ సోదరులు, సురభి ప్రభాకర్ శర్మ, మాజీ ఉప సర్పంచ్లు ధరణిపతి రమణారావు, ఉలుపాల శేఖర్ రెడ్డి, సోనగంటి గొవర్థనాచారి, మాజీ పిఏసియస్ డైరెక్టర్ తిరుమణి పాపయ్య, గ్రామ పాలక వర్గం వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్, సందె లక్ష్మయ్య, మర్ల యాదగిరి, శివర్ల పర్వతాలు, గ్రామ పెద్దలు మర్రు రామారావు, మోర కిరణ్, జూలురి శ్రీధర్, గ్రామ ప్రజలు , గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



