వేతనాల పెంపుదలకై శాంతియుత నిరసన. - పార్ట్ టైమ్ స్వీపర్స్ యూనియన్
విశ్వంభర, హైదరాబాద్ :- పౌర గ్రంధాలయ శాఖ తెలంగాణ పార్ట్ టైమ్ స్వీపర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రంధాలయ డైరెక్టర్ , రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ కార్యాలయాల వద్ద శాంతి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తక్షణమే మా వేతనాల పెంపుదల కొరకు ఈ నిరసనను చేపట్టామని అలాగే సమాన పనికి సమాన వేతనం ద్వారా వేతనాలు చెల్లించాలి . సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అనే ప్రధానమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం రాష్ట్ర గ్రంధాలయ డైరెక్టర్ శ్రీహరి , రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ డా.రియాజ్ లకు వినతిపత్రం అందజేశారు. గత 30 సం.రాలుగా పని చేస్తున్నామని ఉద్యోగ భద్రతా కల్పించకపోవడం అలాగే జీతాలు పెంచకపోవడం వలన కుటుంబ పోషణ చాలాభారంగా ఉందని అన్నారు. ప్రస్తుత జీతం 6000 వేల రూపాయలు దేనికి సరిపోవడం లేదని ప్రస్తుత కాలంలో నిత్యావసర ధరలు , పిల్లల పోషణ , స్కూల్ ఫీజలు భారం అవుతుందని వాపోయారు. పేరుకే స్వీపర్లమే కానీ ఇప్పుడు ప్రతి గ్రంథాలయంలో మేమే ఫుల్ టైమ్స్ స్వీపర్గా, అటెండర్ గాను, రికార్డ్స్ అసిస్టెంట్ గాను, అలాగే గ్రంథపాలకులుగా విధులు కూడా మేమే నిర్మిస్తున్నామని అన్నారు. రికార్డ్స్ రాయడం బిల్స్ చేయడం వంటి పనులు కూడా చేస్తున్నామని అయినా ప్రభుత్వం గుర్తించకపోవడం బాధగా ఉందని అన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ డా.రియాజ్ ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పిట్ట హుస్సేన్ , గౌ.అధ్యక్షులు ఎలగందుల శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి మధు కస్తాల తదితరులు పాల్గొన్నారు.



