12న జన సమితి ప్లీనరీకి భారీగా తరలిరండి : నరసయ్య

విశ్వంభర, బాగ్ లింగంపల్లి:  మే 12న హైదరాబాదులోని జలవిహార్‌లో నిర్వహించనున్న తెలంగాణ జన సమితి నాలుగో ప్లీనరీ సమావేశాలకు గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని ప్రజలు భారీగా తరలిరావాలని తెలంగాణ జన సమితి నాయకుడు నరసయ్య  పిలుపునిచ్చారు. గురువారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ జన సమితి, ఈ ప్లీనరీ సమావేశాల ద్వారా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జన సమితి ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆకుల శ్రీనివాస్, బీసీ జన సమితి రాష్ట్ర కన్వీనర్ ఎస్ జస్వంత్ కుమార్, లీగల్ సెల్ కన్వీనర్ సయ్యద్ ఇస్మాయిల్, ముషీరాబాదు కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ యాదవ్, నగర ఉపాధ్యక్షులు మధు, జైపాల్ రెడ్డి, లక్ష్మణ్, అధికార ప్రతినిధి రవికాంత్, నాయకులు సదానంద్, జహురుద్దీన్, అజయ్ గౌడ్, బాలరాజ్, సాయి, రమాకాంత్, రవి, మల్లేష్, పాషా, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 08 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/on-12th-jana-samithi-plenary-come-in-large-numbers-narasiah/article-15068

Tags: