బంగ్లాదేశ్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం.-హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసన. - విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి జూకురి సంపత్ వర్మ 

బంగ్లాదేశ్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం.-హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసన. - విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి జూకురి సంపత్ వర్మ 

విశ్వంభర, దేవరకొండ :- బంగ్లాదేశ్ లో ప్రతినిత్యం హిందువులపై  జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ దేవరకొండ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ నుండి కోర్టు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ ఎదుట బంగ్లాదేశీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి జూకురి సంపత్ వర్మ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో  మైనారిటీలుగా ఉన్న హిందువులపై నిత్యం  దాడులు చేస్తూ వారిని బలవంతంగా మతమార్పిడి చేస్తూ ,అక్కడి మెజారిటీ ముస్లింలు  నిత్యం మారణకాండ సృష్టిస్తున్నారని అన్నారు. బంగ్లాదేశ్ దేశ దేశవ్యాప్తంగా హిందువులపై ప్రతినిత్యం దాడులు చేస్తున్న అక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. కేవలం మతం ఆధారంగా ఏర్పడిన బంగ్లాదేశ్ లో  ముస్లింలు మారణకాండను సృష్టిస్తున్న మన దేశంలోని ఏ రాజకీయ పార్టీ నాయకులు కనీసం ఇట్టి వ్యవహారాన్ని ఖండించే సాహసం చేయడం లేదని, మైనారిటీలకు కాలిలో ముళ్ళు విరిగిన ఏడ్చి గగ్గోలు పెట్టే మానవతావాదులు, సెక్యులర్ వాదులు, బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై నిత్యం దాడులు జరుగుతున్న కనీసం నోరు మెదపడం లేదని ఆయన అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇట్టి వ్యవహారంపై చర్యలు చేపట్టి అక్కడి మైనారిటీ హిందువులకు రక్షణ కల్పించాలని అన్నారు. బంగ్లాదేశ్ నుండి ఇతర దేశాల నుండి ఇక్కడికి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలకు ముస్లింలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్న రాజకీయ పార్టీలు బంగ్లాదేశ్ లోని మైనారిటీ హిందువుల గురించి కనీసం మాట్లాడకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయ గౌరవాధ్యక్షులు చిలువేరు చంద్రమౌళి గురు స్వామి విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు గుంటోజు రామకృష్ణ ,జిల్లా సహాయ కార్యదర్శి ముంత రామకృష్ణ, నగర ఉపాధ్యక్షులు నీలా సంజీవ ,బజరంగ్దళ్ నగర అధ్యక్షులు ఐతరాజు శ్యామ్ హిందూ సంఘాల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Read More సైబర్ నేరాలపై అవగాహన సదస్సు 

 

 

 

Tags: