యుపిఎస్ కు వ్యాన్ వితరణ
విశ్వంభర, నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పార్వతమ్మ గూడెం ప్రాథమికో న్నత పాఠశాలకు నెల్లికుదురు మండలానికి చెందిన విజయవాడలో లైబ్రేరియన్ భూక్య వెంకన్న వ్యాన్ వితరణ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల బోధన తరహాలో హెచ్.ఎం.హెచ్చు నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలోని ఉపాధ్యాయ బృందం పాటుపడుతున్న కృషిని తెలుసుకొని విద్యార్థుల రాకపోకల కోసం నూతన వ్యాన్ ను సోమవారం పాఠశాలకు అందజేశారు. ఈసందర్బంగా హెచ్ఎం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంఈఓ రాందాస్ హాజరై మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థుల కోసం వెంకన్న వ్యాన్ డొనేట్ చేయడం అభినందనీయమన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు నమోదు మరింత పెరిగి ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. హెచ్ఎం నరేంద్ర కుమార్ మాట్లాడుతూ వ్యాన్ దాత వెంకన్న సేవా నిరతికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన స్ఫూర్తితో పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో టీచర్స్ శశికళ, నాగమణి, శ్రీలత,ప్రవీణ్, వెంకటరత్నం,రంజిత్,ఫఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.



