సభాపతి పదవికి రోల్ మోడల్
On
విశ్వంభర, నెల్లికుదురు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పీకర్ గా దివంగత దుద్దిళ్ళ శ్రీపాదరావు సభా మర్యాదలను,ప్రజాస్వామ్య విలువలను కాపాడి రోల్ మోడల్ గా నిలిచిన మహనీయుడ ని తహసిల్దార్ చంద నరేష్ అన్నారు. శ్రీపాదరావు జయంతి వేడుక సోమవారం నెల్లికుదురు తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ నరేష్ శ్రీపాదరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ శ్రీపాదరావు క్రమశిక్షణ,నిబద్ధత,నిరాడంబరమైన జీవనశైలి నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



