బోనాలకు బ్యాండ్ అనుమతించండి
విశ్వంభర, హైదరాబాదు : బోనాల పండుగలో ప్యాడ్ బ్యాండ్‌లకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ ను కలిసిన బ్యాండ్ కళాకారుల ప్రతినిధులు. సౌండ్ కంట్రోల్ కమిషన్ ఏర్పాటు చేసి శబ్ద పరిమితులు నిర్ణయించాలని, రాత్రి 11 గంటల తర్వాత బ్యాండ్ వాయిద్యాలు నిలిపివేయాలనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జీఓ నెంబర్ 227 వల్ల బ్యాండ్ కళాకారుల ఉపాధి దెబ్బతినకుండా చూడాలని, పోలీసుల వేధింపులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. బోనాల పండుగలో డప్పు, బ్యాండ్ వాయిద్యాలు, జానపద కళలు కీలక భాగంగా నిలుస్తాయని, ఈ పండుగ ద్వారా వేలాది కళాకారులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఇటీవల సౌండ్ పొల్యూషన్ పేరుతో ప్యాడ్ బ్యాండ్ వాహనాలపై చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాబట్టి జీఓ 227ను పునఃపరిశీలించి సౌండ్ పరిమితుల ఆధారంగా అనుమతులు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో: చెరుపల్లి సీతారాములు మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి రాజ్ నాగరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ నగర కార్యదర్శి అశ్వాల హనుమంత్ నగర అధ్యక్షులు రాజు నగర సలహాదారులు పాల్గొన్నారు