నక్షా ప్రాజెక్ట్ పనితీరును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడలో పట్టణ ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో అమలవుతున్న నక్షా ప్రాజెక్ట్ క్షేత్రస్థాయి పనితీరును మున్సిపల్ కమిషనర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డు అధికారులు నిర్వహిస్తున్న ఆర్‌ఓఆర్ నమోదు ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. నక్షా ప్రాజెక్ట్ ప్రజల భూములు, ఆస్తుల రక్షణకు సంబంధించిన కీలక కార్యక్రమమని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా రికార్డుల నమోదు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, ప్రాజెక్ట్ ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నక్షా ప్రాజెక్ట్ విజయవంతానికి వార్డు కౌన్సిలర్లు, మీడియా ప్రతినిధుల సహకారం అవసరమని కమిషనర్ పేర్కొన్నారు. అలాగే రికార్డుల నమోదు సమయంలో అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కార చర్యలపై చర్చించారు. స్వచ్ఛ ఆటోల ద్వారా నక్షా ప్రాజెక్ట్ ప్రాముఖ్యతపై ఆడియో సందేశాలు ప్రసారం చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రజలతో నేరుగా మాట్లాడి అవగాహన కల్పించడం ద్వారా నమోదు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని కమిషనర్ అన్నారు.