వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి
- ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి,
- జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్
విశ్వంభర , మహబూబాబాద్: వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ గంగారం , మహబూబాబాద్ మండలాలలో విస్తృతంగా పర్యటించారు. గంగారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఇన్ పేషెంట్, ఔట్ పేషంట్, మందుల స్టాక్, సిబ్బంది హజరు, రిజిస్టర్లను పరిసరాలను పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో స్వయంగా మాట్లాడి అందిస్తున్న వైద్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వేసవికాలం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్, వారిగా వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని, వేసవి తీవ్రత లో తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు తెలియపరచాలని, ఓ ఆర్ ఎస్, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, అవసరం ఉన్నచోట మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, జిల్లాలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి, మాత, శిశు మరణాలను తగ్గించాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రత్యేక నిఘ పెట్టి గమనిస్తూ ఉండాలని, హిట్ వే ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా చూడాలని, షెడ్యూలు ప్రకారం వైద్య సేవలను కొనసాగించాలని అన్నారు. మహబూబాబాద్ మండలం అమనగల్, పర్వతగిరి గ్రామాలలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన ప్రకారం కొనుగోలు చేసి వెంటవెంటనే మిల్లులకు తరలించాలని, ప్రస్తుతం అకాల వర్షాలు పడే సూచన ఉన్నందున వ్యవసాయ శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేయాలని, కేంద్రాలలో గన్ని సంచులు, టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్స్, సిద్ధంగా ఉంచుకోవాలని, త్రాగునీరు, టెంట్, చైర్స్ వైద్య సేవలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు, సహకార 151, ఐకెపి 53, మెప్మా1, గిరిజన కార్పొరేషన్ 8, శాఖల ఆధ్వర్యంలో మొత్తం (213) కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందని అట్టి కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు, జిల్లా లక్ష్యం పూర్తి చేయుటకు అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, కేంద్రాల నిర్వహణ, ధాన్యం కొనుగోళ్ల లో రైతులను ఇబ్బంది పెట్టితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ధాన్యం కొనుగోళ్లు, రవాణా తదితర సంబంధిత విషయాలలో సమస్యలు ఉంటే వెంటనే 7995050789 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎస్ఓ రమేష్, డీఎం సివిల్ సప్లై నరసింహారావు, తహసిల్దార్లు, బాలకిషన్, రాజేశ్వరరావు, ఎంపీడీవో వైష్ణవి, సంబంధిత సిబ్బంది ఉన్నారు.



