యాటకర్లపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు 

యాటకర్లపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు 

విశ్వంభర, అక్కన్నపేట: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం యాటకర్లపల్లి గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ అత్యంత వైభవంగా  నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు బోనాలను పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకు రెమ్మలు చుట్టి దీపాలు వెలిగించి డప్పు చప్పుల మధ్య శివసత్తులు పోతరాజుల పూనకాల మధ్య ర్యాలీగా తరలివెల్లి అమ్మవారి చెట్టు ప్రదక్షణ చేసి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు తమ పిల్ల పాపలను పాడిపంటలను చల్లగా చూడాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మంచినీళ్ల బండ ఉపసర్పంచ్ యాతకర్ల శ్రీధర్ మాజీ ఉప సర్పంచులు యాటకర్ల రాజు పండుగ రమేష్ ఉత్సవ కమిటీ సభ్యులు దుర్గయ్య తిరుపతి వెంకన్న గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/pochamma-bonals-in-yatakarlapalli/article-17163

Tags: