పెరిగిన అడ్మిషన్స్ తో ఆదర్శంగా నిలిచిన బాచుప్పల ప్రభుత్వ పాఠశాల

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, బాచుప్పల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3 ఉన్న అడ్మిషన్స్ గ్రామ సర్పంచ్ చొరవతో 15కు పెరిగింది. బాచుప్పల గ్రామ సర్పంచ్ మాధవి భూపాల్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన 2వ తరగతి అమ్మాయి ఉద్వితను తమ ఊరి ప్రాథమిక పాఠశాలలో చేర్పించడమే కాకుండా పేరెంట్స్ తో కలిసి తమ పాఠశాలను కాపాడుకోవాలనే ఉద్ధేశంతో తల్లిదండ్రులందరిచే తీర్మానం చేయించి గ్రామంలోని 15 మంది విద్యార్థులను చేర్పించి అందరికి ఆదర్శంగా నిలిచారు. వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లు కూడా తమ పిల్లలను చేర్పించారు. ఇప్పుడు బాచుప్పల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 18 కి చేరింది. ఇదే విధంగా ప్రతీ ఊరి ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాలని సర్పంచ్ మాధవీ భూపాల్ కోరారు. ఈ సందర్భంగా తేదీ: 25/6/2026 గురువారం రోజు పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరికీ పాఠశాల హెడ్మాస్టర్ ఓర్సు వెంకటయ్య నోటు బుక్స్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ సందేనబోయిన మహేశ్వరి రవి, ఉపాధ్యాయులు శిరీష, అంగన్వాడి టీచర్ నాగమణి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bachuppala-government-school-stands-as-an-example-with-increased-admissions/article-17220

Tags: