అక్రమ రవాణా నిర్మూలనకు చెక్ పోస్ట్ లు

అక్రమ రవాణా నిర్మూలనకు చెక్ పోస్ట్ లు

  •  సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

విశ్వంభర, సూర్యాపేట: పశువుల అక్రమ రవాణా, ఇసుక, వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పోలీసు శాఖ పటిష్ట నిఘా ఉంచిందని ఎస్పి తెలిపినారు. జిల్లా వ్యాప్తంగా 7 చెక్ పోస్టులలో 24 గంటలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీచేస్తునట్లు తెలిపినారు. మోతే పోలీస్ స్టేషన్ పరిధి మామిళ్లగూడెం టోల్గేట్ వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్ట్ జిల్లా ఎస్పీ నరసింహ సందర్శించి వాహనాల తనిఖీలను పరిశీలించారు. చెక్ పోస్ట్ రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాలలో ఏడు అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ చెక్ పోస్ట్ ల ద్వారా అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానత వ్యక్తులకు కదలికలపై పూర్తిస్థాయి నిగా ఉంచామని అన్నారు. వరి ధాన్యం అక్రమ రవాణా జరగకుండా, పీడీఎస్ బియం, ఇసుక, పశువుల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన నిగా ఉంచి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడినట్లైతే అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ చెక్ పోస్ట్ నందు పోలీస్ సిబ్బంది 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎస్పీ  వెంట కోదాడ డివిజన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, మోత ఎస్సై అజయ్ కుమార్, చెక్ పోస్ట్ విధులు నిర్వహణ సిబ్బంది ఉన్నారు.

Tags: