బీజేపీతో పొత్తుండదు.. కమలం సైద్ధాంతిక శత్రువు..!!

 బీజేపీతో పొత్తుండదు.. కమలం సైద్ధాంతిక శత్రువు..!!

 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో కీలక ప్రకటన చేసింది సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే).

విశ్వంభర, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో కీలక ప్రకటన చేసింది సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే). రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో ఎలాంటి పొత్తుకూ తావులేదని పార్టీ స్పష్టంగా వెల్లడించింది. ఈ విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని టీవీకే డిప్యూటీ సెక్రటరీ నిర్మల్ కుమార్ ప్రకటించారు. తమ రాజకీయ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, బీజేపీతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కలిసి పనిచేసే ప్రశ్నే లేదని ఆయన తేల్చిచెప్పారు.

Read More పెళ్లి పేరుతో మోసం.. ఎమ్మెల్యే రాహుల్ కు 3 రోజుల పోలీస్ కస్టడీ

 

ఇటీవల విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలకు సంబంధించిన అంశాలు, అలాగే కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. పొంగల్ పండుగ సందర్భంగా విడుదల కావాల్సిన ‘జన నాయగన్’కు సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అవుతుండటంపై కేంద్రం జోక్యం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, కరూర్ ఘటనకు సంబంధించి విజయ్‌కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసి, ఈ నెల 19న హాజరుకావాలని సూచించింది. ఈ నెల 12న ఇప్పటికే ఆరు గంటల పాటు విచారణ జరగగా, పండుగ కారణంగా తదుపరి విచారణకు గడువు కోరినట్లు సమాచారం.

 

విచారణ అనంతరం చెన్నైకి తిరిగొచ్చిన సమయంలో నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, టీవీకే సైద్ధాంతిక దృక్పథం మారలేదని పునరుద్ఘాటించారు. బీజేపీ తమకు సైద్ధాంతిక ప్రత్యర్థి మాత్రమే కాకుండా రాజకీయంగా శత్రువని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకేతో కూడా టీవీకే కలిసి పనిచేయదని స్పష్టం చేశారు.

 

‘జన నాయగన్’ సినిమా విడుదలను అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన నేపథ్యంలో, ఆ అంశంపైనా నిర్మల్ కుమార్ స్పందించారు. తమ సినిమా, తమ ఉద్యమానికి ఎవరు మద్దతిచ్చినా స్వాగతమేనని చెప్పారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై తుది నిర్ణయం పార్టీ అధినేత విజయ్ తీసుకుంటారని తెలిపారు. మొత్తం మీద సినిమా విడుదల, సీబీఐ సమన్లు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూడా టీవీకే తన సైద్ధాంతిక వైఖరిని మార్చబోమని ఈ ప్రకటనతో మరోసారి స్పష్టంచేసింది.

tvk

Tags: