నారాయణ యాదవ్ మృతి తీరని లోటు
విశ్వంభర, బషీర్ బాగ్: గంగాదారి నారాయణ యాదవ్ మృతి యాదవ, బీసీ సమాజానికి తీరని లోటు అని యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం హైదారాబాద్ లోని గాజులరామారంలో నారాయణ యాదవ్ పార్దివ దేహం వద్ద యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ నివాళ్లు ఆర్పించారు.ఈ సందర్బంగా డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ నారాయణ యాదవ్ యాదవ సమాజానికి ఎంతో సేవ చేసిన గొప్ప నాయకుడన్నారు.నిరంతరం యాదవుల, పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి అన్నారు.యాదవులు, బీసీలు,పేద ప్రజలు న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేశారన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరింవారన్నారు.నివాళులర్పించిన వారిలో శివ ప్రసాద్ యాదవ్,ఉమ్మడి ఏపీ సెక్రటేరియట్ యూనియన్ అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



