సమస్యల పరిష్కారానికి ధర్నా
విశ్వంభర, హైదరాబాద్ : కార్మికుల సమస్యలను పరిష్కరించమని కోరుతూ హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా మెజిస్ట్రేట్ ఇ. వెంకటాచారిని కార్యాలయంలో భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్ )నేతలు సమావేశమయ్యారు. కనీస పెన్షన్ పెంపు, ఒప్పంద తాత్కాలిక కార్మికుల రెగ్యులరైజేషన్, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, ఏజెంట్లను కార్మికులుగా గుర్తింపు, భద్రతా పరిమితుల పెంపు వంటి సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. రామ్ రెడ్డి తెలిపారు. రామ్ రెడ్డి మాట్లాడుతూ, “కార్మికుల న్యాయ హక్కులు తక్షణమే అమలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సమస్యలు పరిష్కరించకుంటే, త్వరలో భారీ ధర్నా కార్యక్రమం ద్వారా నిరసన వ్యక్తం చేస్తాం. మా సంఘం నిరంతరం కార్మికుల హక్కుల కోసం పోరాటంలో ఉంటుంది,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టి. రామ్ రెడ్డి, ఎం. రాధాకృష్ణ, జె. రాజేష్, టి. కృష్ణ, సంపత్, అంజనేయులు, బిక్షపతి, ప్రదుమన్. నాయకులు పాల్గొన్నారు.



