కాంగ్రెస్‌లో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. బాంబ్ పేల్చిన జగ్గారెడ్డి

కాంగ్రెస్‌లో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. బాంబ్ పేల్చిన జగ్గారెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఒకరికి ఒకరు తగ్గకుండా మాటల తూటాలు పేల్చుతున్నారు. గత కొంతకాలంగా అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని.. తెలంగాణ సీఎం మారుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నారు. 

 

Read More కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలను కూల్చడంలో బీజేపీ నేతలు పీహెచ్‌డీలు చేశారని సెటైర్లు వేశారని.. అయితే వాళ్ల డిగ్రీలు తెలంగాణలో పనికిరావని అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డిని ఏం చేయలేరని చెప్పారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని చెబుతున్న కిషన్ రెడ్డి కామెంట్స్‌ను స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే.. కిషన్ రెడ్దికి తెలియని మరో విషయం .. బీజేపీ నుంచి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని బాంబ్ పేల్చారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటారని.. ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదని తేల్చి చెప్పారు. 

 

Read More కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ.

రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెబుతున్న కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యల్లో అర్థం లేదని అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ బద్ధ శత్రువులని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని జగ్గారెడ్డి కమలం పార్టీని ఆత్మ రక్షణలో పడేశారు. దీంతో.. నిజంగానే బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారా? లేకపోతే జగ్గారెడ్డి వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారా అన్ని చర్చ నడుస్తోంది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా