అయోధ్యని తలపించేలా భద్రాచలాన్ని నిర్మిస్తాం: సీఎం రేవంత్‌

అయోధ్యని తలపించేలా భద్రాచలాన్ని నిర్మిస్తాం: సీఎం రేవంత్‌

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: భద్రాచలాన్ని అయోధ్యను గుర్తు చేసేలా సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: భద్రాచలాన్ని అయోధ్యను గుర్తు చేసేలా సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రజాసభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ పలు కీలక అంశాలను వెల్లడించారు.

తన రాజకీయ జీవితానికి ఆరంభం ఖమ్మం జిల్లాతోనే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ జిల్లా తనకు ప్రత్యేకమైన అనుబంధం కలిగినదని తెలిపారు. ప్రజల మద్దతుతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు.

Read More గత హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఆర్థిక వ్యవహారాల్లో భారీ అక్రమాలు.- ఒక కన్వెన్షన్ సెంటర్‌కు  రూ. 32 లక్షలు చెల్లింపులు. - నిధుల దుర్వినియోగంపై మూడు సార్లు నోటీసులు ఇచ్చినా గత బాధ్యులు స్పందించలేదు: హెచ్‌బీఎఫ్‌ అధ్యక్షుడు క‌వి యాకూబ్‌, కార్యదర్శి వాసు.

ఎన్టీఆర్‌ ఒకప్పుడు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని సీఎం పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో, ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్‌ ఆశయాలను కార్యరూపం దాల్చడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డు పొందాలంటే కుటుంబంలో ఎవరో ఒకరు మరణించాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. అయితే ప్రజాపాలనలో భాగంగా తమ ప్రభుత్వం లక్షలాది పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించిందని సీఎం తెలిపారు. రైతుల కోసం ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసి సమస్యలకు పరిష్కారం చూపిన ఘనత వైఎస్సార్‌దేనని గుర్తుచేశారు. అదే తరహాలో ఇప్పుడు తమ ప్రభుత్వం పేద కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని వివరించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలపై కుట్ర పన్ని, వారికి ఇళ్లు దక్కకుండా చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే పేదలకు ఇళ్లను అందించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం భుజాన వేసుకుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని ఆయన స్పష్టం చేశారు.

భద్రాచలానికి రూ.100 కోట్ల నిధులు ఇస్తానని గతంలో కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ ఆ హామీ అమలుకాలేదని సీఎం విమర్శించారు. అయితే తమ ప్రభుత్వ హయాంలో భద్రాచలంలో భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. భద్రాచలాన్ని భక్తులు, పర్యాటకులు ఆకర్షితులయ్యేలా, అయోధ్యను తలపించే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హామీ ఇచ్చారు.revanth

Tags: