దావోస్ సదస్సులో 'మెగా' సందడి
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సాక్షిగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ పారిశ్రామిక ప్రగతి కోసం దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అక్కడ పర్యాటక పర్యటనలో ఉన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సాక్షిగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ పారిశ్రామిక ప్రగతి కోసం దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అక్కడ పర్యాటక పర్యటనలో ఉన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ఇద్దరు అంతర్జాతీయ వేదికపై కలవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
స్పెషల్ గెస్ట్‌గా మెగాస్టార్
కుటుంబ సమేతంగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో విహారయాత్ర చేస్తున్న చిరంజీవి గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన్ని సాదరంగా దావోస్ సదస్సుకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు చిరంజీవి దావోస్ చేరుకుని తెలంగాణ పెవిలియన్‌ను సందర్శించారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవికి చూపించారు. రాబోయే 20 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి పథం ఎలా ఉండబోతోందో ప్రతిబింబించే ఈ డాక్యుమెంట్‌ను చిరంజీవి ఆసక్తిగా వీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న పారిశ్రామిక దార్శనికతను ఆయన అభినందించారు.
'మన శంకరవరప్రసాద్ గారు'.. ఆత్మీయ సంభాషణ
సదస్సు విరామ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి మధ్య ఆత్మీయ సంభాషణ సాగింది. ఇటీవలే విడుదలైన చిరంజీవి జీవిత కథా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను తన కుటుంబ సభ్యులతో కలిసి చూశానని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. "సినిమా చాలా బాగుంది, ఎంతో ఆస్వాదించాం" అని చెబుతూ చిరంజీవిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
తన ఆహ్వానాన్ని గౌరవించి వచ్చినందుకు చిరంజీవికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలపగా, రాష్ట్ర ప్రగతి కోసం సీఎం చేస్తున్న కృషిని చిరంజీవి కొనియాడారు.



