ప్రతిభా ప్రోత్సాహకాలు

ప్రతిభా ప్రోత్సాహకాలు

విశ్వంభర,  మోత్కూరు : ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించి వారిలో పోటీ తత్వాన్ని పెంచేందుకు పూర్వ విద్యార్థుల సంఘం కృషి చేస్తుందని  మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పోచం నారాయణ అన్నారు. సోమవారం ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం మరియు భారతి ఎడ్యుకేషనల్ సేవా ట్రస్ట్ సంయుక్తంగా నగదు స్కాలర్షిప్ తో పాటు మెరిట్ సర్టిఫికెట్లు అందించారు. గత సంవత్సరం ఆరు నుండి పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులకు  నగదు పురస్కారాలు అందించారు . పదవ తరగతి లో అత్యధిక మార్పులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు పోచం కిష్టమ్మ సత్తయ్య జ్ఞాపకార్థం 8000, 6000, 4000 చొప్పున నగదు  అందజేశారు. 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు కొణతం రాధాబాయి కోదండరావు మెమోరియల్ తరఫున ప్రొఫెసర్ కొణతం చక్రధర్ రావు, కొణతం దామోదర్ రాయుడు గారలు నగదు పురస్కారాలు ప్రథమ 4000 , ద్వితీయ 3000 చొప్పున అందించారు. మొత్తం 11 మందికి  56000 నగదు పురస్కారాలు అందించినట్టు ఆయన తెలిపారు .కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవినేని అరవిందరాయుడు పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి గుజ్జ సోమ నరసయ్య కార్యవర్గ సభ్యులు మొగుళ్లపల్లి సోమయ్య ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Tags: