సూపర్ వైజర్లుగా నియమించాలి

సూపర్ వైజర్లుగా నియమించాలి

విశ్వంభర, పరిగి: రాష్ట్ర ప్రభుత్వం మే నెల 11 తేదీ నుండి జూన్ జూన్10 తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జనగణన హౌస్ లిస్టింగ్ సర్వేలో  ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల ను  సూపర్వైజర్లు గా విధులు కేటాయించాలని పరిగి తహసిల్దార్  వెంకటేశ్వరి  కి  ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర అసోసియేషన్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు  రామాంజనేయులు,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఉస్మాన్ అలీ  ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పి ఆర్ టి యు మండల అధ్యక్షులు  బుగ్గయ్య, ప్రధాన కార్యదర్శి  రాకేష్ మాట్లాడుతూ..  ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యారంగంలో 25 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్నారని,సీనియర్లుగా పని చేస్తున్న వీరికి సూపర్వైజర్లుగా విధులు కేటాయించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు  మొగులయ్య, బసవరాజ్,  అంజలయ్య, వీరేశం, తదితరులు పాల్గొన్నారు.

Tags: