రిటైర్డ్ ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు
On
విశ్వంభర, మోత్కూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు మోత్కూర్ యూనిట్ కార్యవర్గం ఆధ్వర్యంలో పెన్షనర్స్ భవనం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా మోత్కూర్ మున్సిపాలిటీకి చైర్ పర్సన్ గా ఎన్నికైన గడ్డం స్వప్న సోమ నరసయ్య , వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా, 8వ వార్డు కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి ల ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షులు బి. యాదిరెడ్డి కార్యదర్శి ఎ. వల్లభాయి, జిల్లా ఉపాధ్యక్షులు ఏ. అవిలిమల్లు, జిల్లా కార్యదర్శి ఎం. అంజయ్య, సహా అధ్యక్షులు జి. రాజా బోసు, ఉపాధ్యక్షులు టి. మనోహరాచారి, ఎస్. యాదగిరి లక్ష్మి, కార్యదర్శులు బి. రామ్ రెడ్డి, బి. వెంకటేశ్వర్లు, కోశాధికారి వి. యాదగిరి పాల్గొన్నారు.



