ఇసుక ట్రాక్టర్లు, నల్లబెల్లం పట్టుకున్న పోలీసులు
- 11 మందిపై కేసు నమోదు
విశ్వంభర, నెల్లికుదురు: అక్రమ ఇసుక రవాణా కు పాల్పడుతున్న, నల్ల బెల్లం తరలిస్తున్న 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు. మండలంలోని ఆకేరు వాగు నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణాకు పాల్పడుతున్న మునిగలవీడు గ్రామానికి చెందిన వంగూరి ఉదయ్ కుమార్,మాడ్గుల మహేష్ మదనతుర్తి గ్రామానికి చెందిన గుండెపాక ప్రశాంత్,బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన పెరుమాండ్ల ఉపేందర్,పెరుమాండ్ల ప్రదీప్,రూప్ల తండా పరిధి చకృ తండకు చెందిన జాతోత్ వీరన్న, కేసముద్రానికి చెందిన సారంపల్లీ ఉప్పలయ్య లపై కేసు నమోదు చేసి ఆరు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న రూ 2లక్షల విలువైన 20 క్వింటాళ్ల నల్ల బెల్లం,రూ.5 వేల విలువగల 50 కిలోల పట్టిక, రూ.2వేల విలువ గల 6 లీటర్ల గుడుంబా మండలంలోని నైనాల స్టేజి వద్ద పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో బొలెరో వాహనంలో పట్టు కొని సీజ్ చేసినట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. ఇందుకు సంబంధించి మానుకోటకు చెందిన బానోత్ కిరణ్, గూడూరు కు చెందిన ఆలకుంట్ల అనిల్, ఆవులేగ తండాకు చెందిన గూగులోత నరేష్, బంజర కు చెందిన బానోత్ సాయి కిరణ్ లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
1.jpeg)



