ప్రతి నెల 100 కు పైగా ఫోన్స్ రికవరీ చేస్తున్నాం
- :ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: ఈరోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న సుమారు 20 లక్షల రూపాయల విలువ గల 106 ఫోన్ల ను రికవరీ చేసి జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరమైనది, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం, ఆర్థిక పరమైన అంశాలకు వినియోగిస్తున్నాం, మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నాము అన్నారు, మొబైల్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది. నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతున్నారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారు, ఇతర రాష్ట్రాల వారి నుండి ఈ మొబైల్స్ ను రికవరీ చేశారు. పోలీసు ప్రజల ఆస్తుల రక్షణలో అనుక్షణం ప్రజల పక్షాన పని చేస్తుంది, తప్పుడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు, నేరాలకు పాల్పడే వారికి ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు, సామాన్యుల పట్ల మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు శాఖ అరైవ్ అలైవ్ అనే భద్రత మహా ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రోడ్డు భద్రత అపై విసృతంగా అవగాహన కల్పిస్తున్నాం అన్నారు. ప్రజలు అత్యాసకు పోయి సైబర్ మోసాల బారిన పడోద్దు తక్కువ వడ్డీకి లోన్స్ ఉన్నాయి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, బహుమతులు వచ్చాయి అంటే నమ్మి అపరిచితులకు డబ్బులు పంపవద్దు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు, మీ పిల్లలు డ్రగ్స్, అమ్మాయిల రవాణా లాంటి కేసుల్లో చిక్కుకున్నారు డిజిటల్ అరెస్ట్ చేస్తాం అని CBI, CID లాంటి దర్యాప్తు సంస్తల పేర్లు చెప్పి డబ్బులు కడితే కేసు నుండి తప్పిస్తాము అంటారు ఇది నమ్మవద్దు డిజిటల్ అరెస్ట్ అబద్దం అన్నారు. పోలీసు మీకోసం ఉన్నారు, ప్రజా భద్రతలో అనుక్షణం కృషి చేస్తున్నాము, మీ ప్రాంతాల్లో జరుగుతున్న అశాంఘిక చర్యలు, అక్రమ రవాణా పై పోలీసుకు సమాచారం ఇవ్వాలి, సమాజంలో జరుగుతున్న అసాంఘిక చర్యలు, అక్రమాలు, అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రశ్నించే ప్రతిఒక్కరు యూనిఫాం లేని పోలీసు, వీటిపై మాకు సమాచారం ఇవ్వండి మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం అన్నారు, ప్రజలు పోలీసులకు మిత్రులుగా ఉంటూ నేరాల నివారణలో భాగస్వామ్యం కావాలి అన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సైబర్ వారియర్స్, డ్రగ్స్ నిర్మూల వారియర్స్ లాగా ఉండాలి వీటిపై సమాచారం ఇస్తే మీరు పోలిసుతో భాగస్వామ్యం అయినట్లే, సైబర్ మోసాల గురించి చుట్టుపక్కల వారికి అవగాహన కలిగించాలి. పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపిన మొబైల్స్ పొందిన బాధితులు.. పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, ఐటి కోర్ సిబ్బంది, మొబైల్ పోగొట్టుకున్న బాధితులు పాల్గొన్నారు.



