గీతంలో త్యాగరాజ ఆరాధన వేడుకలు 

గీతంలో త్యాగరాజ ఆరాధన వేడుకలు 

విశ్వంభర, సంగారెడ్డి:  హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లలిత, ప్రదర్శన కళల విభాగం ఆధ్వర్యంలో సోమవారం త్యాగరాజ ఆరాధన  వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు త్యాగరాజ కీర్తనలను హృద్యంగా ఆలపించారు. తొలుత ఈ ప్రదర్శన ఆనందు మురళి, మృదు రవళిల ‘ఎందరో మహానుభావులు..’తో ఆరంభమై, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది.  ఈ ప్రదర్శనలు త్యాగరాజ కవి  ఆధ్యాత్మిక లోతును, సంగీత వారసత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించాయి. శాస్త్రీయ సంగీతం, నృత్యం, సంప్రదాయాన్ని మేళవించి, నిర్వహించిన ఈ ఆరాధన సుసంపన్నమైన సాంస్కృతిక అనుభవాన్ని అందించింది. లలిత, ప్రదర్శన కళల విభాగం సమన్వయకర్త డాక్టర్ వై.లలితా సింధూరి పర్యవేక్షణలో, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆనందు మురళి, దర్భా మృదురవళి ఈ ఆరాధనా కార్యక్రమాన్ని సమన్వయం  చేశారు.

Tags: