సర్పంచ్ లకు సన్మానం

సర్పంచ్ లకు సన్మానం

విశ్వంభర, రామన్నపేట: రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో కొమ్మాయిగూడెం సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ లను సన్మానించారు. ఈ సందర్భంగా సాధన సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య , వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ,  సాధన సమితి కార్యక్రమాలలో భాగంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను సన్మానించడం జరిగిందని ప్రజా పత్రినిధులు అందరూ కూడా నియోజకవర్గం  వచ్చేదాకా మేమంతా సహకరిస్తామని ఎలాంటి పోరాటాల కైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో  సాధన సమితి కార్యదర్శి గడ్డం యాదగిరి, ఎర్ర శేఖర్, బత్తుల సత్తయ్య, నకిరెకంటి నరేష్, పెండెం రవీందర్,  విజయభాస్కర్, దండుగుల రాములు, నరేందర్, బోయపల్లి మల్లేశం, అంబాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Tags: