పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి : వి హెచ్ 

పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి : వి హెచ్ 

విశ్వంభర, అంబర్ పేట: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. జాతీయ జెండా రూపకల్పన దినోత్సవం సందర్భంగా అంబర్‌పేటలో పలు చోట్ల జెండా ఆవిష్కరించి పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పింగళి వెంకయ్యకు మహాత్మా గాంధీ సూచనలతో జాతీయ జెండా రూపుదిద్దుకుందని తెలిపారు. ఇలాంటి గొప్ప సేవ చేసిన వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోత రోహిత్ ముదిరాజ్, రాజేష్ అగర్వాల్, లక్ష్మణ్ యాదవ్, పుల్ల నారాయణస్వామి, దిడ్డి రాంబాబు, పులి జగన్ సత్తిబాబు గౌడ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, రామ్మోహన్, గడ్డం శ్రీధర్ గౌడ్, పంజాల వెంకటేష్ గౌడ్, కోటం అనిల్, రావుల సుధాకర్, సి సుధాకర్, మహేష్ గౌడ్, సందీప్ గౌడ్, కోట్ల కిరణ్, షేక్ జమీర్ ఖాదర్ షరీఫ్, జహంగీర్, షేక్ సర్ఫరోస్, సునీత రెడ్డి, విజితా రెడ్డి, లావణ్య, శాంతమ్మ, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Tags: