లేబర్ కోడ్ల రద్దుకు దేశవ్యాప్త నిరసనలు
On
విశ్వంభర, హైదరాబాదు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక కార్మిక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని వివిధ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన నిరసన దినాన్ని బ్లాక్ డేగా పాటిస్తూ కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ సందర్భంగా హైదరాబాదులో బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ… కొత్త కార్మిక చట్టాలు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఉద్యోగ భద్రత, వేతనాలు, సంక్షేమం వంటి అంశాల్లో ఈ చట్టాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గంపై ఒత్తిడి పెంచే విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. కార్మిక హక్కులను కాపాడేందుకు ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.



