బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన అరుణ్
On
విశ్వంభర, ఢిల్లీ : తెలంగాణలో బీసీల రాజ్యాధికార పోరాటానికి మద్దతు కోరుతూ టైగర్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు ఆర్ అరుణ్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ సాద్వి నిరంజని జ్యోతిని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. రాష్ట్రంలో బీసీల హక్కుల సాధన కోసం పోరాటాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



