తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
విశ్వంభర, నిజామాబాద్: భూ సమస్యలు ఇతరత్ర సమస్యల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సిరికొండ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. స్థానిక ఎమ్మార్వో రవీందర్ రావును పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యాలయానికి వివిధ సమస్యల నిమిత్తం వచ్చే ప్రజలతో సత్ప్రవర్తనతో మెలగాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి,సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు చందర్ నాయక్, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్,ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి,పొలసాని శ్రీనివాస్,ఆర్మూర్ బాల్ రాజు,శ్రీనివాస్,ఎర్రన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు మహేందర్ తదితరులు ఉన్నారు.



