ప్రభుత్వ పాఠశాలలో థియేటర్ వర్క్ షాప్
విశ్వంభర, హైదరాబాద్ : దేవాలమ్మా నగరం జిల్లాపరిషత్ హై స్కూల్ లో 8వ, 9వ తరగతి విద్యార్థులకు జనపదం నాటక సమాజం బుధవారం థియేటర్ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ సందర్బంగా మండల విద్యాధికారి ఎలికట్ట గురవా రావు మాట్లాడుతూ, ప్రముఖ కవి, జాతీయ స్థాయి రంగస్థల దర్శకుడు దెంచనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత నలభై రెండు సంవత్సరాలుగా వేలాది ముంది విద్యార్థులకు నటనలో శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భావోద్యేగ ప్రదర్శన, కంఠ విన్యాసాలు, వ్యూహాశక్తి పెంచుకోవడం, కథ చెప్పడం తదితర అంశాల్లో శిక్షణ నుస్తున్నట్లు చెప్పారు. సమాజంలో జరుగుతున్న హింస, దోపిడీ, అసమానతలు పోయి మనుషులంతా ఒకరిని ఒకరు అన్ కండీషనల్ గా ప్రేమించడానికి ప్రభుత్వాలు ముందుకు వచ్చి కర్ణాటక తదితర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నట్లు మన రాష్ట్రం లో కూడా ప్రతి స్కూల్ లో సాంస్కృతిక ఉత్సవాలు, కళా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని ఆయన కోరారు. ప్రముఖ కవయిత్రి, ఉపాధ్యాయురాలు శివజ్యోతి శిక్షణా కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు దెంచనాల గారిని మళ్ళీ వచ్చి వర్క్ షాప్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా మండల విద్యాధికారి, పాఠశాల స్టాఫ్ తో కలిసి శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించారు.



