ఘనంగా ట్రాన్స్ జెండర్ విజిబిలిటీ డే 

ఘనంగా ట్రాన్స్ జెండర్ విజిబిలిటీ డే 

విశ్వంభర, అబిడ్స్ : అంతర్జాతీయ ట్రాన్స్ జెండర్ విజిబిలిటీ డే కార్యక్రమాన్ని హైదరాబాదు నగరంలో ఘనంగా నిర్వహించారు. ట్రాన్స్ జెండర్ వ్యక్తుల గౌరవం, హక్కుల పరిరక్షణ, సాధికారతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా కార్యక్రమం జరిగింది. క్వియర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్, మాంట్ ఫోర్ట్ సోషల్ ఇనిషియేటివ్, వాసవి కిన్నర్ వెల్ఫేర్ సొసైటీ, ప్రజ్వల సంయుక్త ఆధ్వర్యంలో  హైదరాబాదు అబిడ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రాన్స్ జెండర్ వ్యక్తుల ధైర్యం, కృషిని సత్కరించారు. కార్యక్రమంలో అనిత రామచంద్రన్, వి సి సజ్జనార్, దివ్య దేవరాజన్, బి శలజ, పంచాక్షరి పాల్గొని హక్కులు, సంక్షేమంపై మాట్లాడారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని సత్కరించారు. ఈ సందర్భంగా ‘బిల్డింగ్ సర్కిల్స్ ఆఫ్ కేర్’ నివేదికను విడుదల చేశారు. కార్యక్రమంలో ముకుంద మాల సహా కమ్యూనిటీ సభ్యులు, తల్లిదండ్రులు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: