రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
-ఎమ్మెల్యే మురళీ నాయక్
విశ్వంభర,ఇనుగుర్తి: రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తి లో మార్క్ ఫెడ్ సౌజన్యంతో, పిఎసిఎస్ ఆధ్వర్యంలో మొక్క జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతోపాటు బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. కర్షకుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు.ప్రతి గింజను కొనుగోలు కేంద్రనికి తీసుకురావాలని ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరకే అమ్ముకోవాలని,దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు,ఎంపీడీవో పార్థసారథి,ఏవో మహేందర్,ఏఎంసీ డైరెక్టర్ రాము,నాయకులు బైరు అశోక్ గౌడ్, కూరెల్లి సతీష్,కదిర జగన్,రాజేందర్ రెడ్డి,ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి,బానోతు నరేష్,చెడుపాక యాకయ్య, వివిధ గ్రామాల సర్పంచులు,ఉపసర్పంచులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



