జిమ్ సెంటర్ ను ప్రారంభించిన సబితా రెడ్డి
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ పాయింట్ బిల్డింగ్ 2వ అంతస్తులో సీతారాం నాయక్ నూతనంగా ఏర్పాటు చేసిన అస్త్రం ది రియల్ జిమ్ ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి , మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ జిమ్ కు వచ్చి, ఉదయం సాయంత్రం జిమ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ప్రతి ఒక్కరూ పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



