పేకాట రాయుళ్లు అరెస్ట్

పేకాట రాయుళ్లు అరెస్ట్

విశ్వంభర, చింతపల్లి: మండల పరిధిలోని కుర్మేడ్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి, కేసు నమోదు చేశారు. మండలంలోని కుర్మెడు గ్రామ శివారులో బుధవారం పేకాట ఆడుతున్నారనే  సమాచారం రావడంతో చింతపల్లి ఎస్సై ముత్యాల రామూర్తి తన సిబ్బందితో కలసి పేకాట శిబిరంపై దాడి చేసి, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి‌ తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి నాలుగు మోటార్ సైకిల్స్, ఆరు సెల్ ఫోన్లు రూ.16100 నగదు స్వాధీనం చేసుకుని  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Tags: