అంత్యోదయ కార్డులను పునరుద్ధరించాలి
On
విశ్వంభర, ఇనుగుర్తి: రద్దుచేసిన అంత్యోదయ అన్నయోజన కార్డులను పునర్ధరించాలని కోరుతూ దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ అనిల్ కు బుధవారం జిల్లా కేంద్రంలోని ఆయన చాంబర్లో వినతి పత్రం అందజేశారు. గత 3సం.ల క్రితం అప్పటి పౌరసరఫరాల శాఖ అధికారులు మానుకోట జిల్లాలోని అల్పాదాయ ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాల వారికి, భర్తను కోల్పోయిన పేద మహిళలకు అంత్యోదయ కార్డులు మంజూరు చేశారని,వీటిని మధ్యలోనే రద్దు చేశారని దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే పునరుద్ధరించాలని,కొత్తవారి కి సైతం కొత్తగా కార్డు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పప్పుల వెంకన్న,పెర్మండ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



