రోడ్డు భద్రత సూచిక బోర్డులు ఏర్పాటు

రోడ్డు భద్రత సూచిక బోర్డులు ఏర్పాటు

విశ్వంభర, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో భారత్ పెట్రోల్ బంక్ వద్ద మూలమలుపు వద్ద ఎక్కువగా వాహనాలు ప్రమాదాలకు గురవడంతో ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన ధర్పల్లి  ఎస్ఐ శ్రీనివాస్,  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు,ధర్పల్లి మండల ప్రజలు నిజామాబాద్ నుండి ధర్పల్లి భారత్ పెట్రోల్ బంక్ మూలమలుపు వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న స్థలాన్ని గుర్తించి బుధవారం రోజున ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు టూ వీలర్ వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని అన్నారు. అలాగే కార్ డ్రైవింగ్ చేసేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ధర్పల్లి, బీజేపీ మండల అధ్యక్షుడు మైపాల్, బీజేవైఎం కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Tags: