అందెల శ్రీరాములు యాదవ్ కు సన్మానం 

అందెల శ్రీరాములు యాదవ్ కు సన్మానం 

విశ్వంభర, హైదరాబాద్: మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ ను యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్, వైస్ చైర్మన్ చిలుకల శ్రీనివాస్ యాదవ్  మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం అందెల శ్రీరాములు యాదవ్ ను శాలువాతో సన్మానించారు.ఈ నెల 13 తేదీన బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా  హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యాదవ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న యాదవ పొలిటికల్ సదస్సుకు రావాలని ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రంలో యాదవులకు మంత్రి పదవి, జనాభా దామాషా ప్రకారం రాజకీయ, ఉద్యోగ రంగాలలో వాటా  లేదన్నారు.యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు విషయాలను చర్చించారు.ఈ విషయాలపై అందెల శ్రీరాములు యాదవ్ సానుకూలంగా స్పందించారు.

Tags: